సికింద్రాబాద్, అక్టోబర్ 9 : వయసు పైబడిన వృద్ధులకు పెద్దకొడుకులా.. దివ్యాంగులకు ఆప్తుడిలా.. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన వింతంతువులకు అన్నలా.. ఒంటరి మహిళలకు తోబుట్టువుగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పింఛన్లు ఇస్తూ భరోసా కల్పిస్తున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలోనే సుమారు 67,438మందికి పింఛన్లు ఇస్తూ కొం డంత బలాన్ని నింపుతున్నారు.ఈ ఆసరా దేశమంతా కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారు.
నేడు లాలాపేటలో డిప్యూటీ స్పీకర్ పింఛన్లు అందజేత..
రాష్ట్ర సర్కారు నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు నేడు లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డిలతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అందజేయనున్నారు. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఆదే విధంగా సోమవారం మధ్యాహ్నం బౌద్ధనగర్ డివిజన్లోని కమ్యూనిటీ హాల్లో లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి పింఛన్ కార్డులను అందజేయనున్నారు.
కేసీఆర్ సార్ నెలనెలా పింఛన్ ఇస్తున్నడు
నెలనెలా సీఎం కేసీఆర్ రూ.2వేలు పింఛన్ ఇస్తూ పెద్దకొడుకులా మారాడు. పింఛన్ డబ్బులు మందులు, ఇంట్లో సరుకులకు వాడుకుంటున్నా. గత పాలకులు కేవలం రూ.200మాత్రమే పింఛన్ ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కేసీఆర్ సీఎం పింఛన్లు పెంచి వికలాంగులకు రూ.3 వేలు, ఇతరులకు రూ.2 వేలు ఇస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయి. ఎల్లవేళలా అండగా ఉంటాం.
– ఎండీ ఖాజా, పింఛన్‌దారుడు, తిరుమలగిరి
కేసీఆర్ సార్ దేశాన్ని ఏలాలి..
రాష్ట్రంలో పింఛన్‌దారులకు పెద్దకొడుకులా మారిండు. పింఛన్ డబ్బులతో ఎవరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన గొప్ప మనసున్న మారాజు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశంలో ఉన్న అర్హులందరికీ పింఛన్లు వస్తాయి. పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్న ఆయన సల్లంగా ఉండాలి.
– జె. మహావులా, పింఛన్‌దారుడు, తిరుమలగిరి