హిమాయత్‌నగర్,అక్టోబర్8: రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన స్పౌజ్ కేటగిరి ఉపాధ్యాయులు (భార్య,భర్త )లను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారని, వారికి ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ స్పౌజ్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ వివేక్, కో- కన్వీనర్ ఖాదర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… భార్య, భర్తలు ఒకే జిల్లాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు నిలిచిపోవడంతో సుమారు 2,300మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 19 జిల్లాలో బదిలీలు జరిగాయని, మిగిలిన 13 జిల్లాల్లో పని చేసే ఉపాధ్యాయులను సైతం దీపావళి లోపు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఫోరం నాయకులు జానకీరాంరెడ్డి, నాగరాజు, రాములు, ఆనందం, ప్రశాంత్, శ్రీనివాస్‌రెడ్డి, భారతి, త్రివేణి, రాజగోపాల్‌రెడ్డి, జావీద్ పాల్గొన్నారు.