ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 7: దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలలోకి వచ్చినట్లు రాష్ట్రమంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్)నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంతో పాటు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపి శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అనే క రాష్ర్టాలు అభివృద్ధికి నోచుకోక కుంటుపడిన విషయాలు కేసీఆర్ను కదిలించాయన్నారు.
దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మంత్రి మల్లారెడ్డిని కలిసిన వారిలో మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, చౌదరిగూడ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్, నాయకులు బిక్షపతి గౌడ్, గోపాల్ రెడ్డి, శ్రీరాములు గౌడ్, విఘ్నేష్ గౌడ్, రాము, అయిలయ్య యాదవ్, శంకర్ గౌడ్, రమేశ్, వీరేశం, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.