సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఎల్బీస్టేడియంలో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ కార్యక్రమం నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని బట్టి ట్రాఫిక్‌ను మళ్లించడం, నిలిపివేయడం చేస్తామన్నారు. బషీర్‌బాగ్, పీసీఆర్ జంక్షన్, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, నారాయణగూడ, హమాయత్‌నగర్, ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల, అంబేద్కర్ విగ్రహం, కవాడిగూడ, కట్టమైసమ్మ ఆలయం, కర్బాలమైదాన్, బైబిల్ హౌస్, రాణిగంజ్, నల్లగుట్ట జంక్షన్ల నుంచి నిర్ణీత సమయంలో రాకపోకలు కొనసాగించకపోవడం మంచిదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ సీపీ కోరారు.
ట్రాఫిక్ మళ్లింపు..