ఎల్బీనగర్, సెప్టెంబర్ 24: నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజాలో భాగంగా శనివారం చైతన్యపురి మానేపల్లి జ్యువెలరీలో లక్కీ డ్రా తీశారు. మానేపల్లి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు మురళీకృష్ణ, గోపీకృష్ణ, చైతన్యపురి స్టోర్ హెడ్ డి. వీరేశం, నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, డిప్యూ టీ మేనేజర్ సందీప్ జోషి, ఎల్బీనగర్ ఆర్సీ ఇన్చార్జి సత్యనారాయణ, మానేపల్లి జ్యువెలర్స్ వినియోగదారురాలు నాగోలుకు చెందిన సునీతతో కలిసి లక్కీడ్రాను తీశారు. ఈ డ్రాలో మొదటి బహుమతిని ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీ ఇంద్రప్రస్తఎన్క్ల్లేవ్కు చెందిన గృహణి డి.చరణ్యరెడ్డి గెలుచుకోగా, రెండో బహుమతిని సి. శ్రేయ, మూడో బహుమతిని విక్రం, నాల్గో బహుమతిని వి. సంపత్, ఐదో బహుమతిని బి. వినీలా గెలుచుకున్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా బొనాంజా ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్, కేఎల్ఎం షాపింగ్ మాల్ టైటిల్ స్పాన్సర్లుగా, బిగ్ సీ, సీఎంఆర్ ప్యామిలీ మాల్ మెయిన్ స్పాన్సర్లుగా, పవర్డ్‌బై నీలోఫర్ కేఫ్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అడ్వర్టయిజింగ్ మేనేజర్ సురేందర్‌రెడ్డి, ప్రతినిధులు యాదగిరి, ఆంజనేయులు, పాషా, ప్రకాశ్, శీనయ్య పాల్గొన్నారు.
బోనాంజాలో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా బొనాంజాలో భాగస్వాములవడం ఆనందంగా ఉంది. నాణ్యత, మన్నిక,నమ్మకానికి మానేపల్లి జ్యూవెలరీ పేరు నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే ఒక్కసారి మా షోరూంకు వచ్చే ఖాతాదారులు మా కుటుంబంలో భాగస్వాములై షాపింగ్ చేస్తుంటారు. నమస్తే తెలంగాణ అందరికీ ఇష్టమైన, నమ్మకమైన పత్రిక. మా కస్టమర్‌కు మొదటి బహుమతి రావడం సంతోషంగా ఉంది.
– మురళీకృష్ణ (మేనేజింగ్ డైరెక్టర్,మానేపల్లి జ్వువెలరీ)
ఖాతాదారుల అభిరుచులకు అనుగుణంగా మానేపల్లి సొంత ఫ్యాక్టరీలో, సొంతంగా డిజైన్లు తయారు చేసి అమ్మకాలు చేస్తూ అందరి నమ్మకాన్ని పొందుతున్నాం. దీపావళి నాటికి కొంపల్లి సుచిత్ర వద్ద, చందానగర్‌లో నూతన బ్రాంచ్‌లను ప్రారంభించబోతున్నాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా బొనాంజాకు అనూహ్య స్పందన లభిస్తున్నది.
– ఎం. గోపీకృష్ణ ( మేనేజింగ్ డైరెక్టర్, మానేపల్లి జ్యువెలరీ)
బహుమతి రావడం సంతోషం
మానేపల్లి జ్యువెలరీలో షాపింగ్ చేశాను. నాకు మొదటి బహుమతి రావడం సంతోషంగా ఉంది. మానేపల్లి జ్యువెలరీ షాపులో డైమండ్‌ను నిన్ననే తీసుకున్నాను. మానేపల్లి జ్యువెలరీలో అన్ని రకాలైన నగలు ఆకర్షణీయంగా లభిస్తాయి. నమస్తే తెలంగాణ దసరా బొనాంజా డ్రాలో బహుమతి వచ్చిందనగానే చాలా సంతోషంగా ఫీలయ్యాను. -దేప చరణ్యరెడ్డి (మొదటి బహుమతి విజేత)
ఇక్కడే ఎక్కువగా ఆభరణాలు కొంటాం..
మానేపల్లి జ్యువెలరీలో వినియోగదారులకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. రెగ్యులర్ గా ఇక్కడే ఆభరణాలు కొనుగోలు చేస్తున్నాం. బంగారం ధరలు, క్వాలి టీ, డిజైన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ షాపింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా బొనాంజా లక్కీడ్రాలో పాల్గొనడం ఆనందంగా ఉంది.
-సునీత (వినియోగదారులు, నాగోలు)