కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 21 : తెలంగాణ ప్రభుత్వం ఆడపడచులకు బతుకమ్మ చీరెలను కానుకగా అందిస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం బాలాజీనగర్ డివిజన్ వార్డు కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపిణీని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ శిరీషాబాబురావు, ఉప కమిషనర్ కె.రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని తొమ్మిది రోజులపాటు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపడచులకు బతుకమ్మ చీరెను కానుకగా అందిస్తున్నదన్నారు. పేద కుటుంబాల్లో బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కానుకలను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, ప్రాజెక్టు ఆఫీసర్ ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ నేతలున్నారు.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం, పేద మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరెలను కానుకగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతియేటా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నదని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్ అన్నారు. బుధవారం కూకట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఉప కమిషనర్ పి.రవీందర్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి ప్రభాకర్, జానకి, మీనాకుమారీ, విజయ, ప్రేమ్‌కుమార్, నర్సింగ్, సాయి, సుమలత, ప్రమీల తదితరులున్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ వార్డు కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ ప్రారంభించారు. ఫుడ్ రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలు సమీపంలోని కేంద్రంలో బతుకమ్మ చీరెలను తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీవో ప్రభాకర్, ఏఎంహెచ్‌వో వెంకటరమణ, ఎస్ఎస్ మురళీధర్ రెడ్డి, సీవో సురేశ్, ఎస్ఎఫ్ఏ సూర్యనారాయణ, స్థానిక టీఆర్ఎస్ నాయకుడు రాచకొండ భాస్కర్ నాయీ ఉన్నారు.
బాలానగర్ : బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు కానుకలు అందజేసి గౌరవించడమే తెలంగాణ సాంప్రదాయం అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం పరిధి ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ గంగపుత్ర సంఘంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ (కానుకలు)చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్, డీసీ రవీందర్‌కుమార్‌లు హాజరై మహిళలకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వమతాల పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరేందర్‌గౌడ్, నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్, హరినాథ్, మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగ్ హాజరయ్యారు.
ఫతేనగర్ డివిజన్ పరిధి భగత్సింగ్పార్క్లో మహిళలకు కానుకల (చీరలు) పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ కానుకలు అందజేశారు. కార్యక్రమంలో మహిళ అధ్యక్షురాలు శిల్ప, కృష్ణకుమారిలతో పాటు మహిళలు పాల్గొన్నారు.
అల్లాపూర్: బతుకమ్మ చీరెలతో మహిళల్లో ఆనందాన్ని నింపిందని అల్లాపూర్ కార్పొరేటర్ సబీహాబేగం అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో లబ్ధిదారులకు కార్పొరేటర్ మహిళలకు చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. పండుగులను మహిళలు ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా బతుమ్మ చీరలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నేతలు వీరారెడ్డి, నాగుల సత్యం, పార్వతమ్మ, రోణంకి జగన్నాథం, జహీద్ షరీఫ్ బాబా, సంజీవరెడ్డి, రవీందర్‌రెడ్డి, అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.