కుత్బుల్లాపూర్/గాజులరామారం, సెప్టెంబర్ 21 : ఆడపడుచులకు కానుకగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని ప్రజాప్రతినిధులు అన్నారు. బుధవారం గాజులరామారం-కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలోని జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, రంగారెడ్డినగర్, చింతల్, జగద్గిరిగుట్ట, గాజులరామారం డివిజన్లలో బతుకమ్మ చీరలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా పలువురు మాట్లాడుతూ.. తెలంగాణలో గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. పేద, మధ్యతరగతి అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ సారెను అందజేయడం హర్షణీయమన్నారు.