పహాడీషరీఫ్, సెప్టెంబర్ 20: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మంగళవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ 16వ వార్డులో జల్పల్లి కమాన్ రోడ్డు అభివృద్ధికి రూ. 2 కోట్ల వ్యయంలో, 13వ వార్డులో రూ.20లక్షల వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ నినాదాలు, విధానాలని అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. కాలనీ, బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ సుదర్శన్, కౌన్సిలర్లు కొండల్ యాదవ్, బుడుమాల యాదగిరి, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, శంషోద్దీన్, టీఆర్ఎస్ నాయకులు నాసర్ అవల్గీ, ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, యంజాల జనార్దన్, వాసుబాబు, విస్కమూరి నిరంజన్, ఎంఏ సమీర్, యాస్మిన్ బేగం, యంజాల అర్జున్, జహంగీర్, యాతం పవన్‌కుమార్ యాదవ్, సాంబశివ, విశాల్‌గౌడ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖాన ప్రారంభం
వైద్యానికి పేదలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రజల చెంతనే బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీలో బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుదర్శన్, కౌన్సిలర్లు పల్లపు శంకర్, భాషమ్మ, అహ్మద్ కసాది, ఖాలెద్ బిన్ అబ్దుల్లా, మాజీ ఎంపీటీసీ దూడల శ్రీనివాస్‌గౌడ్, కర్నాటి పద్మ, బాలాపూర్ ఆరోగ్య కేంద్రం వైద్యులు పాల్గొన్నారు.