మన్సూరాబాద్, సెప్టెంబర్ 20: నాగోల్ డివిజన్ పరిధి నువ్వులబండలోని బస్తీ దవాఖానలో మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఓపీ, ఇమ్యునైజేషన్, ఎన్సీడీ రిజిస్టర్లను పరిశీలించారు. ప్రతి రోజు దవాఖానలో జరుగుతున్న ఓపీ హాజరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీని మరింతగా పెంచేలా కృషి చేయాలని డాక్టర్తో పాటు సిబ్బందికి సూచించారు. ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సంజీవని ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. బస్తీ దవాఖానకు వచ్చే రోగులను సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్తో ఫోన్ ద్వారా మాట్లాడించి వారికి అవసరమైన సమాచారం ఇవ్వడంతో పాటు తీసుకోవాల్సిన చికిత్సపై సూచనలు చేయడం ఈ సంజీవని ముఖ్య ఉద్దేశమని.. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంజీవని సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నువ్వులబండ బస్తీ దవాఖాన డాక్టర్ పావని, సిబ్బంది పాల్గొన్నారు.