మెహిదీపట్నం, సెప్టెంబర్ 20 : బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జీహెచ్ఎంసీ సర్కిల్ -13 పరిధిలోని కార్వాన్ నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. టోలిచౌకి, నానల్‌నగర్ డివిజన్లలో ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ ప్రారంభిస్తారని డిప్యూటీ కమిషనర్ వి.నర్సింహ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో యూసీడీ అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో డీసీ, డీపీవో లలితకుమారి సమావేశం నిర్వహించారు. లంగర్‌హౌస్, గోల్కొండ, నానల్‌నగర్, టోలిచౌకి, కార్వాన్, జియాగూడ డివిజన్లలో 23 ప్రాంతాల్లో 38 కేంద్రాల్లో ఇవ్వనున్నారు. వారం రోజుల పాటు బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందని డీసీ తెలిపారు. కార్యక్రమంలో నానల్‌నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, డీపీవో లలితకుమారి, డిప్యూటీ ఈఈ వెంకటరాజు పాల్గొంటారన్నారు.
38 పంపిణీ కేంద్రాలు ఇవే ..
జియాగూడ భారత అభ్యుదయ పాఠశాలలో 5 కేంద్రాలు, కార్వాన్ యాదవ సంఘం కార్యాలయంలో 3, తాలిం ఆమ్లాపూర్ రామమందిరం కమ్యూనిటీ హాల్లో 2 , పన్నిపురా కమ్యూనిటీ హాల్, 2 జే బస్‌స్టాప్ వద్ద ఓంశాంతినగర్, సబ్జిమండీ గంగ పుత్ర కమ్యూనిటీ హాల్, సబ్జి మండిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆర్.ఆర్. మ్యాక్స్ ఫంక్షన్ హాల్, టప్పాచబుత్ర యూసుఫ్ నగర్ చైతన్య స్కూల్, ముస్తాయిద్పురా గిర్కపల్లి స్కూల్, లంగర్‌హౌస్ గొల్లబస్తీలో ఉన్న శిశుమందిర్ పాఠశాలలో 4 , లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో ఉన్న అక్షర స్కూల్, రాందేవ్‌గూడ కమ్యూనిటీ హాల్, లంగర్‌హౌస్ కాళిదాస్ పురాలో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గోల్కొండ బాక్రి ఫంక్షన్ హాల్, గోల్కొండ ధాన్కోటలో ఉన్న సుల్తాన్ ఉలుం పబ్లిక్ స్కూల్, టోలిచౌకి ఎండీ లైన్స్‌లో ఉన్న ఒవైసీ కమ్యూనిటీ హాల్, గోల్కొండ ప్రియదర్శిని స్కూల్లో 3 , ఖాదర్‌బాగ్‌లో ఉన్న న్యూ ఇంగ్లిష్ పబ్లిక్ స్కూల్, సాలార్జంగ్ కాలనీలోని కాకతీయనగర్ కమ్యూనిటీ హాల్లో 2 , హకీంపేట్ కుంటలో ఉన్న అంగన్వాడీ స్కూల్, హకీంపేట్‌లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో 2 కేంద్రాలు, సాలార్జంగ్ కాలనీలో ఉన్న కాకతీయ నగర్ పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు.