అంబేద్కర్ పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ గ్రేటర్లోని పలు చోట్ల ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
అంబర్పేట, సెప్టెంబర్ 15: స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం చరిత్రాత్మకమైనదని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దీంతో అంబేద్కర్ను సముచితంగా గౌరవించుకున్నట్లయ్యిందని చెప్పారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయన సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.