చర్లపల్లి, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరా ట యోధురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సు భాష్‌రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తా, కుషాయిగూడ దోభీఘాట్లోని ఆమె విగ్రహానికి కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీషాసోమశేఖ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మను యువత ఆదర్శం గా తీసుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన కులాలను గుర్తించలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ముఖ్యంగా రజకవృత్తిదారులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ రజక సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శనిగరం అశోక్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, గుమ్మడి రాజుల సోమయ్య, సకినాల రవి, సత్యనారాయణ, కరుణాకర్, కొమురయ్య, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, కాసం మహిపాల్‌రెడ్డి, శేర్ మణెమ్మ, గరిక సుధాకర్, సుడుగు మహేందర్‌రెడ్డి, డప్పు గిరిబాబు, కుమారస్వామి, బాలరాజు, కందుల లక్ష్మీనారాయణ, అనిల్ ముదిరాజ్, బాజీబాషా, చంద్రారెడ్డి, రెడ్డినాయక్, సత్యనారాయణ, యాకయ్య, శ్యామ్, రాకేశ్, నర్సింహ, శిరీషారెడ్డి, శోభారెడ్డి, రామాదేవి పాల్గొన్నారు.
ఘన నివాళి..
హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి , నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, మేకల ముత్యంరెడ్డి, మస్క సుధాకర్, చిన్నారావు, వంశీరాజ్ పాల్గొన్నారు. అదేవిధంగా చిలుకానగర్‌లోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు మల్లేశ్, కృష్ణ, ఎలేంద్ర, రవి, లింగం, నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల్ల కొండల్‌రెడ్డి, జగన్ పాల్గొన్నారు.