గౌతంనగర్, సెప్టెంబర్ 10: ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటూ.. ఆసరా పింఛ న్లతో భరోస్తా ఇస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం ఆనంద్‌బాగ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మౌలాలి డివిజన్‌కు చెందిన 925 మందికి కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డులను కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్తో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నెలనెలా పింఛన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం అందించి.. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులను ఆదుకుంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబానికి అండగా ఉన్నార ని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు పింఛన్లను అందించి ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి మల్లికార్జున్, టీఆర్ఎస్ నాయకులు జీఎన్వీ సతీశ్‌కుమార్, అమీనొద్దీన్, గుండా నిరంజన్, భాగ్యానందరావు, మౌలాలి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సత్తయ్య, ఆదినారాయణ, సంతోశ్ నాయుడు, మంద భాస్కర్, నాగేశ్, చందు, శైలేందర్, సంతోశ్రాందాస్, కన్న, సూరి, జానీ సాగర్, జాన్‌బీ పాల్గొన్నారు.
ధైర్యంగా బతుకుతాం..
ఎంసీ కేసీఆర్ సార్ ఇచ్చిన పింఛన్‌తో ధైర్యంగా బతుకుతాం. ఎవరిపై ఆధారపడకుండా దేవుడిలా పింఛన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.. మాలాంటి పే దలకు పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న సీఎంకు రుణపడి ఉంటాం.. – అంజమ్మ, బోరబండ బస్తీ
బతుకుకు భరోసా..
పేదల బతుకుకు భరోసా కల్పించిన దేవుడు సీఎం కేసీఆర్. ఎన్నో ప్రభుత్వాలను చూశాం.. పింఛన్లు అందించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్లను అందించినందుకు సంతోషంగా ఉం ది. వృద్ధులు, వంటరి మహిళలు, దివ్యాంగులు, వితంతులకు పింఛన్లు అందించి సీఎం కేసీఆర్ పుణ్యం కట్టుకున్నారు. – పద్మమ్మ, ఓల్డ్ సఫిల్‌గూడ