హయత్‌నగర్, సెప్టెంబర్ 7: హాస్టల్ వార్డెన్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు, బాధిత విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం… హయత్‌నగర్ డివిజన్ కేంద్రం అన్మగల్లో ఓ ప్రైవేటు స్కూల్ బాలికల వసతి గృహం కొనసాగుతున్నది. నలుగు విద్యార్థినుల పట్ల అదే హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్ కృష్ణ గత కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.
సెల్ఫోన్లలో అశ్లీల వీడియోలు చూపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వార్డెన్ వేధింపులు రోజురోజుకు తీవ్రం కావడంతో తొమ్మిదవ తరగతి విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి స్కూల్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. అప్పటికే హాస్టల్ వార్డెన్ కృష్ణ తప్పించుకొని పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు స్కూల్ వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు వార్డెన్ కృష్ణపై పోక్సో యాక్టు, జువైనల్ జస్టిస్ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.