జవహర్‌నగర్,సెప్టెంబర్ 4: దేశాన్ని సాకే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, బీజేపీ పాలిత ప్రాంత రాష్ర్టాల్లో అభివృద్ధి శూన్యమని, ఆసరా పింఛన్లతో ప్రతి పేద కుటుంబంలో సీఎం కేసీఆర్ పెద్దకొడకయ్యాడని కార్మిక శాఖ మత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని డీఎంఎఫ్టీ నిధులు రూ. 2.5 కోట్లతో 3, 19, 20, 21, 25 డివిజన్ల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, 9, 22 డివిజన్లో సీసీ రోడ్లను,28వ డివిజన్లో బస్తీ దవాఖానను మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో ఆసరా పింఛన్లను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తూ మాట్లాడుతున్న మాటలు వింటే విడ్డూరంగా ఉందని, తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు కేంద్రానికి కడుతున్నామని, మన రాష్ర్టానికి మాత్రం ఒక్క రూపాయి కూడా రావడం లేదని అన్నారు.
తెలంగాణలోని 46లక్షల కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని అన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో 896 మందికి ఆసరా పింఛన్లు మంజురయ్యాయని మంత్రి తెలిపారు. అంతకు ముందు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో మంత్రికి స్వాగతం పలికారు. బస్తీ దవాఖానతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జ్యోతిరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్మెంబర్లు, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్,అధికారులు ప్రభాకర్‌యాదవ్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.