ఘట్కేసర్,సెప్టెంబర్4 : గణేశ్ ఉత్సవాల్లో భాగంగా, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం నిర్వాహకులు అన్నదానం చేశారు. పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనర్సింహ కాలనీలో శివ యూత్ వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమంలో చైర్మన్ కొండల్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, శివ యూత్ ప్రతినిధులు , భక్తులు పాల్గొన్నారు.
ఘట్కేసర్లోని బాలాజీనగర్‌లో వివేకానంద యువజన సంఘం వినాయక మండపం వద్ద మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ ప్రారంభించారు. కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకుడు ఎం. జంగయ్య యాదవ్, యువజన సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : నాగారం మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు పరిధి..పలు కాలనీల్లో నిర్వహించిన అన్నదానంలో కౌన్సిలర్ గూడూరు సబితఆంజనేయులు గౌడ్ పాల్గొన్ని భక్తులకు అన్నదానం చేశారు. నిర్వాహకులు కౌన్సిలర్ దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్ఐ జగన్‌రెడ్డి, కాలనీల నేతలు పాల్గొన్నారు.
శామీర్‌పేట, సెప్టెంబర్ 4 : ఉమ్మడి శామీర్‌పేట మండలంలో ఆదివారం అలియాబాద్, శామీర్‌పేట, లాల్‌గడి మలక్‌పేట, లక్ష్మాపూర్, మూడుచింతలపల్లి తదితర గ్రామాల్లో గణేశ్ మండపాల వద్ద అన్నదానం చేసి, వినాయక నిమజ్జనాల ఊరేగింపు నిర్వహించారు. సర్పంచ్ కుమార్‌యాదవ్, ఉపసర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.