ఎల్బీనగర్, సెప్టెంబర్ 4: ప్రజల చెంతకే ప్రభుత్వం వైద్యం వచ్చిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తపేట డివిజన్లోని మోహన్‌నగర్ ప్రజయ్‌నివాస్ ఫేజ్-1లో బస్తీ దవాఖానను కార్పొరేటర్ వవన్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి డివిజన్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడంతో నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా ముందుకు సాగుతోందన్నారు.
ప్రజయ్‌నివాస్ ప్రాంత వాసులతో పాటు పరిసర కాలనీల వాసులకు బస్తీ దవాఖాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట కార్పొరేటర్ ఎన్.పవన్‌కుమార్, ఎల్బీనగర్ మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మన్ లింగాల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్‌గౌడ్, నాయకులు అనంతుల రాజారెడ్డి, జహీర్‌ఖాన్, ఉదయ్‌గౌడ్, సుందర్, తిరుమల్, ప్రజయ్‌నివాస్ ఫేజ్-1 కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్, కొత్తపేట పీహెచ్సీ డాక్టర్ నరేశ్, బస్తీ దవాఖాన డాక్టర్ మౌనికతో పాటు పలువురు పాల్గొన్నారు.