డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత
తార్నాక పరిధిలో మట్టి ప్రతిమలు పంపిణీ
సికింద్రాబాద్, ఆగస్టు 28: నవరాత్రుల్లో మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజలు చేస్తూ పర్యావరణ రక్షణకు దోహదపడాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. ఈ నెల 31న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణాన్ని రక్షించాలనే ఆలోచనతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో మట్టి విగ్రహాలను ఆదివారం తార్నాకలోని తన క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా లక్షలాది మట్టి వినాయక విగ్రహాలను ఐదు నెలల నుంచి తయారు చేయించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.