సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): పాతనగరంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పాత నగరం, మలక్పేట, ఎల్బీనగర్ వైపు పురానాపుల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాదర్ఘాట్ బ్రిడ్జి, చాదర్ఘాట్ క్యాస్ వే, మూసారంబాగ్ బ్రిడ్జి వైపు నుంచి వెళ్లే వాహనాలను అవసరాన్ని బట్టి మళ్లింపు చేపడుతున్నారు. ఈ ఆంక్షలను బుధవారం సాయంత్రం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.