ముషీరాబాద్, ఆగస్టు 24: అడిక్‌మెట్ డివిజన్ పద్మకాలనీ పార్కును సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం ఆయన ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవితో కలిసి పద్మకాలనీ పార్కును సందర్శించారు. పార్కు అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై చర్చించిన వెంటనే పనులు ప్రారంభించాల్సింది సూచించారు. స్థానికుల ఉపయుక్తంగా ఉండేలా గ్రీనరీ ఏర్పాటు చేయడంతోపాటు ఫుట్‌పాత్, వ్యాయామ విభాగం వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పలు పార్కులను ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని, త్వరలో మరిన్ని పార్కుల్లో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, దీన్‌దయాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ముషీరాబాద్ డివిజన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సీఎం సహాయ నిధి ద్వారా మంజూరై చెక్కులను పంపిణీ చేశారు. ముషీరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఐదుగురు లబ్ధిదారులకు 1.58 లక్షల రూపాలయ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్‌ప్రసాద్, ఆకుల ఆరుణ్, శ్రీధర్‌రెడ్డి, ఎయిర్టెల్ రాజు, శివముదిరాజ్, పూస గోరఖ్‌నాథ్, గోవింద్, శ్రీకాంత్ గౌడ్, ఉమారాణి, శోభ, సదా తదితరులు పాల్గొన్నారు.