హయత్నగర్, అగస్టు 22: శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా 3వ రోజు హయత్నగర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ, హయత్నగర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చిన్నారులు, పెద్దలతో కలిసి ఉట్టికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొట్టారు.
ఈ సందర్భంగా పలువురు చిన్నారులు శ్రీకృష్ణ, గోపికల వేశాధారణలో ఉట్టిని పగుల గొట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టీఆర్ఎస్ బీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు, యాదవ సంఘం అధ్యక్షుడు గడ్డం బాలకృష్ణ యాదవ్, గడ్డం బాబురావు యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్, దొడ్డి భాస్కర్ యాదవ్, రాహుల్ యాదవ్, జెల్లా శ్రీకాంత్ యాదవ్, సాయి యాదవ్, బండారి మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.