మేడ్చల్ రూరల్, ఆగస్టు 17: వజ్రోత్సవాల్లో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, గుండ్లపోచంపల్లిలో బుధవారం రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మేడ్చల్‌లో నిర్వహించిన శిబిరంలో ప్రోగాం అధికారి డాక్టర్ రామ్‌కుమార్ ఆధ్వర్యంలో శ్రీరంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శైలజ, సీహెచ్‌వో మహల, సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, యువకులను రక్తదానంలో భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో తాము రక్తదానం చేసినట్టు తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఎంఎల్ఆర్ కళాశాలకు చెందిన 150మంది విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు.
రక్తదానం చేసిన వారికి ఆయన సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. కమిషనర్ అహ్మద్ షఫీయుల్లాహ్, కౌన్సిలర్ శివకుమార్, మాజీ ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఆనంద్, వైద్యాధికారులు శైలజ, కీర్తన, స్వర్ణలత, శ్రీకాంత్, సిబ్బంది మల్లేశ్వరి, బుజ్జి పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ఆవరణలో నిర్వహించిన శిబిరంలో ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులు 33 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.