కవాడిగూడ, ఆగస్టు 3: భోలక్‌పూర్ డివిజన్లో నాడు అధ్వానంగా ఉన్న రోడ్లు నేడు అందంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కొన్నేండ్లుగా గుంతల మయం కావడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు నరకయాతన పడేవారు. చిన్న వాన పడిందంటే రోడ్లన్నీ చిత్తడయ్యేవి. కోట్లాది రూపాయలు వెచ్చించి డివిజన్లో నూ తనంగా వీడీసీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను సమన్వ యం చేసి భోలక్‌పూర్‌లో రోడ్లకు మహార్దశ తీసుకొచ్చారు. డివిజన్లోని పలు బస్తీ లు, కాలనీలలో నూతనంగా సీసీ రోడ్లు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించారు. డివిజన్లోని ఇందిరానగర్, సు ప్రీం హోటల్ మండీగల్లీ, అంజుమన్ స్కూల్ ప్రాంతం, పద్మశాలి కాలనీ, పీఅండ్‌టీ కాలనీ, కత్నీకాంఠ తదితర బస్తీలలో సీసీ రోడ్లను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించారు. రోడ్డు నిర్మాణం పూర్తిచేయడంతో నేడు పాదచారులు, ద్విచక్ర వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 20 కోట్లతో పైపులైన్ల ఏర్పాటు..
భోలక్‌పూర్ డివిజన్లో రూ. 20 కోట్లతో తాగు నీటి, డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణ పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే భోలక్‌పూర్ సమస్యల పరిష్కారంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని స్థానికులు తెలిపారు.
భోలక్‌పూర్‌లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నాం
భోలక్‌పూర్‌లో గతంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉండేవి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవతో డివిజన్లో సీసీ రోడ్లు వేస్తున్నాం. నూతనంగా డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల ఏర్పాటుతో సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగింది. అన్ని బస్తీలలో సీసీ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – తిరుపతి,
(ఏఈ- జీహెచ్ఎంసీ)