సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఎగువన విస్తారంగా కురుస్తున్న వానలతో జంట జలాశయాల్లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఉస్మాన్సాగర్కి 1500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలో నాలుగు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి 1552 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. హిమాయత్ నగర్‌కి ఎగువ నుంచి 2500 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2532 క్యూసెక్కుల నీరు మూసీలోకి చేర్చుతున్నారు. జంట జలాశయాల నుంచి మొత్తంగా 4084 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళుతుందని అధికారులు పేర్కొన్నారు.