సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): దిబ్రూగర్ – ఎస్ఎంవీటి బెంగళూరు స్టేషన్ల మధ్య మొత్తం 26 వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ నెల 2 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ రైళ్ల రాకపోకలు కొనసాగుతాయన్నారు.
విజయవాడ – నాగర్సల్ – నర్సాపూర్ స్టేషన్ల మధ్య రెండు వీక్లీ ప్రత్యేక రైళ్ల రాకపోకలను కొనసాగించనున్నట్లు ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. ఈ నెల 5 నుంచి 20 వరకు ఈ రైళ్ల రాకపోకలు కొనసాగుతాయన్నారు.
నాందెడ్ – విజయవాడ స్టేషన్ల మధ్య ఈ నెల 4న వన్‌వే రైలు నడుపున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
వాల్సద్ – వెలంకాని స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్ల రాకపోకలను కొనసాగించనున్నట్లు, ఈ రైళ్లు ఈ నెల 27, 29 తేదీలలో నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
నాలుగు రైళ్ల పునరుద్ధరణ
సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్, గుంటూరు నుంచి తిరుపతికి నాలుగు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఈ ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు ప్రకటించారు.