దుండిగల్, ఆగస్టు 2: తాళం వేసి ఉన్న విల్లాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఓ సభ్యుడిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షాపూర్‌నగర్‌లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాచుపల్లి హైలాండ్ హోమ్స్‌లోని విల్లా నంబరు 35లో నివాసముంటున్న దట్ట యుగేందర్ కుటుంబం జూన్ నెలలో అమెరికాకు వెళ్లింది. తన ఇంటి తాళాలు నిజాంపేట్‌లో ఉండే తమ వియ్యంకుడు చంద్రశేఖర్ రావుకు ఇచ్చి వెళ్లా రు. కాగా, జూలై 2న ఇంటి పని మనిషి విల్లా వద్దకు వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఈ విషయాన్ని చంద్రశేఖర్‌రావుకు సమాచారం అందించగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఇంట్లో ఉంచిన 5 తులాల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా విల్లా నంబరు 40లో సైతం 60 తులాల బంగారం, కిలో వెండిని ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు అందిం ది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సీఐ నర్సింహారెడ్డి నేతృత్వంలో పోలీసుల బృం దం సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా, రాత్రి వేళలో నలుగురు వ్యక్తు లు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు 1వ తేదీన 9 గంటలకు పోలీసులు బాచుపల్లి చౌరస్తా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీలల్లో అటుగా వచ్చి అనుమానాస్పదంగా తచ్చాడుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కుక్చి తాసీల్, కానియాంబ గ్రామానికి చెందిన కిరణ్ మనోహర్ బాబర్(23)ను అదుపులోకి తీసుకుని విచారించారు. రెం డు విల్లాల్లో దొంగతనానికి తామే పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో కిరణ్ మనోహర్ బాబర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించా రు. కాగా ఈ చోరీలకు పాల్పడిన వికాస్, జాలమ్, మోహ న్ అలియాస్ మహబత్లు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి 20 తులాల వెండి గిన్నెను స్వాధీనం చేసుకున్నారు.