ముషీరాబాద్, ఆగస్టు 2: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంగం జాతీయ కన్వీనర్ చెరుకుల రాజేందర్ తెలిపారు. మంగళవారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలకు ఏ మాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమంతో పాటు వచ్చే నెల 9,10,11 తేదీల్లో నిరసన, ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు బాశయ్య, జీ.అనంతయ్య, రామకృష్ణ, బాలయ్య, సాయిబాబా, సురేశ్ పాల్గొన్నారు.