అల్లాపూర్, ఆగస్టు 2: దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ సబీహాబేగంతో కలిసి ఎమ్మెల్యే డివిజన్ పరిధిలో పద్మావతీనగర్, కొత్తూరు సీతయ్యనగర్, సఫ్థార్నగర్లో రూ.2కోట్ల 20లక్షల వ్యయంతో సీసీరోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభు త్వం పని చేస్తుందని, అల్లాపూర్ డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు వేచించి అన్ని రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో అభివృద్ధి పనులు పూర్తిచేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, పల్లి తిరుపతి, వీరారెడ్డి, జహెద్ షరీఫ్ బాబా, శ్రీనివాస్‌రెడ్డి, మహమూద్, నూర్ఖాన్, జగన్నాథం, మస్తాన్ రెడ్డి, రవీందర్‌రెడ్డి, సంజీవ తదితరులు పాల్గొన్నారు.