దుండిగల్, ఆగస్టు 2 : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోకవర్గ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాలు, ప్రజాప్రతినిధులు శంభీపూర్‌లోని కార్యాలయంలో ఎమ్మెల్సీని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. అదే విధంగా నియోజకవర్గ పరిధిలో జరిగే శుభకార్యాలకు హాజరుకావాలంటూ ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఈ సందర్భం గా శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరి ష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
స మస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే.. వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్సీని కలిసినవారిలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌యాదవ్, కార్పొరేటర్ రావుల శేషగిరి, మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్లు శ్రీనివాస్‌యాదవ్, బాలాజీనాయక్, దుండిగల్ కౌన్సిలర్లు శంకర్‌నాయక్, మహేందర్‌యాదవ్, సాయియాదవ్, నేతలు దేవేందర్, శ్రీకాంత్‌యాదవ్, అమ ర్సింగ్, రవీందర్‌నాయక్, భాస్కర్‌రెడ్డి, సాయికిరణ్, నర్సింహారెడ్డి ఉన్నారు.