కీసర, ఆగస్టు 2 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మతితప్పి మాట్లాడుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. కీసర మండల కేంద్రంలోని లలిత కన్వెన్షన్ హాల్లో మంగళవారం మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మతితప్పి మాట్లాడుతున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాసంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, టీఆర్ఎస్ పార్టీ నేత డాక్టర్ భద్రారెడ్డి, ఎంపీపీ ఇందిర, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీటీసీ నారాయణశర్మ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ మాధురి వెంకటేశ్, ఉప సర్పంచ్ లక్ష్మణ్‌శర్మ, నాయకులు దయాకర్‌రెడ్డి, సంజీవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్ ముదిరాజ్, రమేశ్‌గుప్త, రవికాంత్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.