ఉప్పల్, జూలై 31 : పరిసరాల పరిశుభ్రతను పాటి స్తూ, వ్యాధుల నివారణకు కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసం లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మొక్కల తొట్లలో నిలిచిన నీటిని తొలగించా రు. నీటి నిల్వలు లేకుండా పరిసరాలను శుభ్రపరిచారు. అనంతరం రవీంద్రనగర్‌లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. దోమలతో వ్యాధులు రాకుండా పరిసరాలను శు భ్రం చేసుకోవాలన్నారు. నీటి ట్యాంకులను శుభ్రం చేసి, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. తులసీ, పుదీన, సిట్రోనిల్ల గ్రాస్, లెమన్ గ్రాస్ మొక్కలు పెంచాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఎంటమాలజీ సూపర్వైజర్ నరేశ్‌రెడ్డి, టీం బీఎస్ఆర్ వ్యవస్థాపకులు బేతి సుమంత్‌రెడ్డి, నేతలు శివ, దాచేపల్లి శ్రీధర్, రెహమాన్, సూరం శంకర్, జేసీబీ రాజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
దోమల వ్యాప్తిని నివారించడంలో భాగంగా ప్రతి ఆది వారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భా గంగా నాచారంలోని కార్తీకేయనగర్లో ఆదివారం పరిస రాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ హార య్యారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం పరిసరాల పరిశుభ్ర తపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేశా రు. స్టిక్కర్లు అతికించి, అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్, కట్ట బుచ్చన్నగౌడ్, శ్రీరామ్ సత్యనారాయణ, మంగోల్ శివకుమార్, మనోజ్, కాలనీవాసులు దత్తారెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.