గోల్నాక, జూలై 30 : వరదలతో దెబ్బతిన్న అంబర్పేట ముసారాంబాగ్ బ్రిడ్జిని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరద ముంపు ఏర్పడుతోందని కిషన్రెడ్డి ఆరోపించారు.దీంతో పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటను విమర్శించారు. కాగా కిషన్రెడ్డి వ్యాఖ్యలపై అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు లింగారావు మాటకు.. మాట పేరుతో ఓ వీడియోను రూపొందించి వ్యంగ్యాస్ర్తాలు విసిరారు.. నమేస్తే కిషనన్నా అంటూ మొదలు పెట్టి .. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసినా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తీసుకున్న ముందస్తు చర్యలతో నియోజకవర్గంలో ముంపు సమస్య రాలేదన్నారు. కేవలం మూడేండ్ల కాలంలో నియోజకవర్గం అన్ని విధాలుగా అభవృద్ధి చెందుతున్న విషయం మీరు గుర్తెరగాలన్నారు.
కానీ మీకిషనన్నా.. నువ్వేం చేసినవో చెప్పు..రు 15 ఏండ్ల పాలనలో ఒక్క మంచిపని ఏమి చేసినవో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముసారాంబాగ్లొ కొత్త బ్రిడ్జిని రూ. 52కోట్లతో కేవలం 9నెలలల్లోనే నిర్మిస్తామని మంత్రులు ప్రకటించారని, కేంద్రమంత్రిగా నువ్వేం చేస్తవో చేప్పాలన్నారు. పదవుల మీద ఉన్న సోయి మీకు ప్రజల మీదలేదన్నారు. ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదన్న విషయం తెలుసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేసే ముందు మీరు ప్రజలకు ఏమి చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ.. రూపొందించిన వీడియో సామాజిక మాథ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోకు ప్రజ లు లైక్లు కొడుతూ మరింత ఉత్సాహ పరచడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.