గౌతంనగర్, జూలై 30 : మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మౌలాలి డివిజన్, సాయినాథపురంలో రూ.77లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆ యన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాయినాథపురం, ప్రగతినగర్, మారుతీనగర్, లక్ష్మీనగర్, గణేశ్‌నగర్, క్రియేటివ్నగర్, మొగల్ కాలనీకి చెందిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేస్తామని తెలిపారు. మొదటి దశలో రూ.77లక్షలతో రోడ్డు నిర్మాణం పూర్తి అయిన వెంటనే.. రెండవ దశలో రూ.65 లక్షలతో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
రూ.65 లక్షల నిధులు మంజూరు…
సాయినాథపురం, ప్రగతినగర్, మారుతీనగర్ వరకు రూ.77లక్షల నిధులు మంజూరు కాగా.. మిగతా రోడ్డు కోసం రూ.65లక్షలు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని ఫోన్లో ఎమ్మెల్యే కోరగా.. వెంటనే ఆ నిధులను మంజూరు చేశారు. దీంతో మొగల్కాలనీ, లక్ష్మీనగర్, క్రియేటివ్నగర్, గణేశ్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో మిగతా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీఇచ్చారు. కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఈఈ లక్ష్మణ్, డీఈ మహేశ్, ఏఈ మధుమిత, టీఆర్ఎస్ నాయకులు సతీశ్‌కుమార్, పిట్ల శ్రీనివాస్, అమీనొద్దీన్, భాగ్యానందరావు, ఇబ్రహీం, మోహన్‌రెడ్డి, రాందాస్ సంతో శ్, ఇంజినీర్ శ్రీనివాస్, చందు, నహీం, నర్సింగ్‌రావు, గౌలికర్ దినేశ్, షకీల్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు గౌలికర్ శివాజీ, పాండురంగాచారి, అమరనాథ్‌రెడ్డి, లక్ష్మీపతి, మురళీకృష్ణ, గణేశ్, నీలమ్మ, కాసీంబీ పాల్గొన్నారు.