-అడ్డగుట్ట, జూలై 27 : అడ్డగుట్ట డివిజన్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ చొరవతో డివిజన్ అన్ని రంగాల్లో అభ్యున్నతి వైపు అడుగులు వేస్తుంది. ప్రధాన సమస్యలైన మంచినీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, కలుషిత నీటి సరఫరాతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి యుద్ధ్దప్రాతిపదిక చర్యలు తీసుకుంటున్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన మంచినీరు, డ్రైనేజీ సమస్యలకు ఇప్పటికే శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. అంతేకాకుండా అస్తవ్యస్థంగా ఉన్న ప్రధాన, అంతర్గత రోడ్ల నిర్వహణపై స్థానిక కార్పొరేటర్ ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగా అవసరమున్న ప్రాంతాల్లో సీసీ రోడ్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. శాంతినగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.27 లక్షలు, వెంకట్నగర్లో రూ.13లక్షలు, అడ్డగుట్ట గణేష్ దేవాలయం వద్ద రూ.8 లక్షలతో, తుకారాంగేట్ మీనా ఆసుపత్రి వద్ద రూ.2.50 లక్షలు, అడ్డగుట్ట సీ సెక్షన్లో రూ.37లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తవడానికి వచ్చాయి. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పనులు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
తది దశలో అభివృద్ధి పనులు
గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్లో అభివృద్ది పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులు తుది దశలో ఉన్నాయి. మరికొన్ని పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. బోనాల ఉత్సవాల నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. అతి త్వరలో వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – వేణు, జీహెచ్ఎంసీ ఏఈ