ఉప్పల్, జూలై 25 : దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన .. బోనాల ఉత్సవాల చెక్కులను ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నిధులను అందజేస్తుందన్నారు. నియోజకవర్గంలోని 130 దేవాలయాలకు రూ.36.75 లక్షల నిధు లు మంజూరు చేసిందన్నారు. ఆలయాల ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ కార్యనిర్వాహణ అధికారి భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపల్లి పద్మారెడ్డి, సూరం శంకర్, ఎండీ రహమాన్, రాధాకృష్ణ, ఏనుగు వసంత పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
చర్లపల్లి, జూలై 25 : అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ బాప్టిస్ట్ చర్చి, చర్చి కాలనీలో మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానికులు సోమవారం ఎమ్మెల్యే బేతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని, చర్చి కాలనీలో మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయను న్నట్లు తెలిపారు. అదేవిధంగా కాలనీలో పారిశుధ్య పనులను వేగవంతం చేయడంతో పాటు వీధిదీపాల నిర్వహణ ను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బాలస్వామి, మహేశ్, కాలనీవాసులు ప్రసా ద్, ప్రదీప్‌కుమార్, సునీత, మాధురి, పద్మ తదితరులు పాల్గొన్నారు.