మియాపూర్, జూలై 24: పేదలను ఆదుకోవటంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలవాలని డబ్ల్యూఎస్వో ట్రస్టు ప్రతినిధులు కూకట్పల్లి కోర్టు 8 ఎంఎం న్యాయమూర్తి భవానీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఐజీ వేముల శ్రీనివాస్, కమర్షియల్ ట్యాక్సెస్ జాయింట్ కమిషనర్ రావుల శశిధర్, ఐపీఎస్ అధికారి రావుల గిరిధర్, బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు అపర్ణ పిలుపునిచ్చారు. దైనందిన విషయాలను పరస్పరం పంచుకునేందుకే అధికంగా వినియోగిస్తున్న వాట్సాప్ గ్రూపును, అందుకు భిన్నంగా సమాజం పట్ల తమ వంతు బాధ్యతతో సేవ చేసేందుకు వేదికగా చేసుకోవటం అభినందనీయమన్నారు. డబ్ల్యూఎస్వో (వీ షెల్ ఓవర్ కమ్) ట్రస్టు కార్యవర్గ నాలుగో వార్షిక సమావేశం ఆదివారం మాసబ్ ట్యాంక్లో జరిగింది.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులతో వాట్సాప్ గ్రూపుగా ఎనిమిదేండ్ల కిందట ఏర్పడి, నాలుగేండ్ల కిందట ట్రస్టుగా నమోదై ఇప్పటి వరకు పేద విద్యార్థులు, వైద్య ఖర్చులు, పచ్చదనం పర్యావరణ పరిరక్షణ సహా ఇతర సామాజిక అవసరాలకు రూ. 52 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు పసుల మహేశ్, కోశాధికారి సునీల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ లక్ష్మీనారాయణ, సీఏ హర్షిణి, సీనియర్ న్యాయవాది రేవతి, ప్రతినిధులు కర్నాటి గోపీనాథ్, గడ్డం సతీశ్, శశిధర్, రాధాకృష్ణ, డైరెక్టర్ మంజుల, జలసాధన సమితి ప్రతినిధి దుశ్చర్ల సత్యనారాయణ, పర్యావరణ హితుడు సురేశ్ గుప్తా, వెంకటేశ్వర్రావు, స్వరూప, పవన్ కుమార్, హరి, సతీశ్, డాక్టర్ స్వరూప, అపర్ణ, రాహుల్, రవీందర్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న వారిని ఘనంగా సన్మానించారు.