మేడ్చల్, ఫిబ్రవరి 7: ఐటీ పార్కుల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దండిగా పెంపొందించి, యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనతో మేడ్చల్ సమీపంలోని కండ్లకోయలో ఏర్పా టు చేయబోతున్న ఐటీ పార్కుతో 20 వేల మందికి ఉపా ధి కానుందని తెలిపారు. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధి కండ్లకోయ మార్కెట్ యార్డు స్థలంలో ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని సోమవారం అధికారులతో కలిసి మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ నగరాన్ని నాలుగు వైపులా అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తున్నదని, అందు లో భాగంగా ఐటీ పరిశ్రమలను మంత్రి కేటీఆర్ నెలకొల్పుతున్నారని చెప్పారు. నగర పరిసరాల్లోనే కాకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఆలోచించి ఐటీ సెక్టార్లు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వెల్లేలా కృషి చేస్తున్నారని అన్నా రు. అందులో భాగంగా మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ‘గేట్ వే’ ఐటీ పార్కు పేరుతో 12 అంతస్తుల తో 5 లక్షల అడుగుల విశాలమైన ఐటీ పార్కును సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో కాలనీలు, గేటేడ్ కమ్యూనిటీలతో అభివృద్ధి చెంది ఉండగా, ఐటీ పార్కు రావడం తో మరింత అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. ఐటీ పార్కు ఏర్పాటుతో 20 వేల మందికి ఉపాధి రానున్నదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఇప్పటికే దావూస్కు వెళ్లి మల్టీ నేషనల్ కంపెనీలతో సమావేశమై, కంపెనీల ఏర్పాటుకు పాటుపడుతున్నారని చెప్పారు. కండ్లకోయలో ఐటీ పార్కు ఏర్పాటు చేయబోతుండగా, ఇప్పటికే 150 సంస్థలు నమోదు చేసుకున్నాయని, ఈ పార్కు మొదటి ఫేజ్ నిర్మా ణ అనంతరం, రెండో ఫేజ్ కూడా ఉంటుందని తెలిపారు.
నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు అనుసంధానంగా ఉన్న ప్రాంతం భవిష్యత్‌లో రూపరేఖలు మారిపోయి, గుర్తింపు గల ప్రాంతంగా మారబోనున్నదని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, డైరెక్టర్లు, గుండ్ల పోచంపల్లి వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్ మల్లికార్జున్, హేమంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మేడ్చల్ తహసీల్దార్ గీత, మున్సిపల్ కమిషనర్ లావణ్య, నాయకులు రాజ మల్లారెడ్డి, సంజీవ పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని తరలించాలి
మార్కెట్ యార్డు ప్రాంగణంలో నుంచి మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని తరలించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. కార్యాలయ తరలింపునకు ఆదేశాలు వ చ్చాయని, నూతన కార్యాలయం నిర్మించుకునే వరకు కండ్లకోయ గ్రామంలోని మున్సిపల్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
‘గేట్ వే’ ఐటీ పార్కు నమూన విడుదల
కండ్లకోయలో ఏర్పాటు చేయబోయే ‘గేట్ వే’ ఐ టీ పార్కు నమూనాను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. అధికారులు, నాయకులతో మార్కెట్ యార్డులోని కమిటీ కార్యాలయంలో కంప్యూటర్లో ఆవిష్కరణ చేసి, ఐటీ పార్కు ఏర్పాటులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
నిత్యాన్నదానంతో మన్ననలు.. అభినందనీయం
మంత్రి చామకూర మల్లారెడ్డి
నిత్యాన్నదానం చేసి మన్ననలు పొందడమనేది చాలా అభినందనీయమని రాష్ట్ర కార్మి క శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసరగుట్టకు విచ్చేసే భక్తులకు నిత్య అన్నదానాలు నిర్వహిస్తున్న ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం సేవలను మం త్రి కొనియాడారు. వచ్చే నెల మార్చి 1వ తేదీన నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కీసరగుట్ట ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం సంఘం నేతలు మంత్రి చామకూర మ ల్లారెడ్డిని కలిసి, ఆయన చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ. సత్రానికి ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన స త్రం అధ్యక్షులు బెలిదే రమేశ్ గుప్త, ప్రధాన కార్యదర్శి రెబెల్లి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి బచ్చు నగేశ్ గుప్త, చైర్మన్ నంగునూరి అశోక్ గుప్త, కో-చైర్మన్ చిరంజి రవీందర్ గుప్త, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.