దుండిగల్/ జీడిమెట్ల/ కుత్బుల్లాపూర్, జూలై 18 : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని.. విద్యలో రాణించి.. తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. సోమవారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి, దూలపల్లి, ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో, దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్‌పల్లి, గాగిల్లాపూర్, సుభాష్‌నగర్ డివిజన్ పరిధి సూరారం కాలనీ ఉన్నత , ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు దాతల సహకారంతో నోటు పుస్తకాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో, క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. చదువులో ఉత్తమ ప్రతిభను సాధిస్తే విద్యార్థులు తమ జీవితాలను బంగారు మయంగా తీర్చిదిద్దుకోవచ్చ న్నారు. కొంపల్లిలో 1,050 మంది విద్యార్థులకు 6,300 నోటు పుస్త కాలు, దూలపల్లిలో 835 మంది విద్యార్థులకు 5,020, బహదూ ర్పల్లిలో 1000 మంది విద్యార్థులకు 6000, గాగిల్లాపూర్‌లో 361 మంది విద్యార్థులకు 2,210, సూరారం కాలనీలో 1400 మంది విద్యార్థులకు 8,400 నోటు పుస్తకాలను అందజేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్లు గంగయ్య నాయక్, తుడుం పద్మారావు, కార్పొరేటర్లు హేమలత సురేశ్‌రెడ్డి, మంత్రి సత్యనారాయణ, కో ఆప్షన్ సభ్యులు మంగమ్మ, షేక్ అన్వర్, సత్యమ్మ, భౌరంపేట పీఎసీఎస్ చైర్మన్ మిద్దె ల బాల్‌రెడ్డి, దూలపల్లి పీఎసీఎస్ చైర్మన్ నరేందర్‌రాజు, వైస్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రఘు, ఎంఈఓ ఆంజ నేయు లు, నాయకులు జెమ్మి దేవేందర్, మాజీ ఎంపీపీ సన్న కవిత, మండ ల టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్, విజయరామిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు నవత, శకుంతల, చంద్రయ్యతో పాటు కౌన్సిలర్లు, స్థానిక నాయ కులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.