కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 18 : గిఫ్ట్ ఏ స్మైల్‌తో త్రిచక్ర వాహనాలను పొందిన దివ్యాంగులు ఆనందంగా ఉన్నారని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా బాలానగర్‌లో త్రిచక్ర వాహనాలను పొందిన వారు కార్పొరేటర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ లు కలిసి దివ్యాంగులకు యాభై త్రిచక్ర వాహనాలను అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మహ్మద్ ఖాజా, దేవులపల్లి కృష్ణమూర్తి, విల్సన్, ఆనంద్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్, నాగేందర్ గౌడ్, ప్రేమ్‌కుమార్, సత్యనారాయణ, దుర్గేశ్, నాగరాజు గౌడ్, నరేశ్, జమీల్, సలీమ్, సుధాకర్ తదితరులున్నారు.
వాహనాలకు పూజలు..
గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా దివ్యాంగులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో దివ్యాంగులు అందుకున్న మూడు చక్రాల స్కూటర్లకు మూసాపేట డివిజన్ టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం వాహనాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులపై ఉదారత చాటిన ఎమ్మెల్యే కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దివ్యాంగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు జిల్లా గోపాల్, నపారి చంద్రశేఖర్, వెంకటేశ్, విష్ణు, జైరాజ్, అరుణ్, నర్సింగ్, డేవిడ్ పాల్గొనారు.