కుత్బుల్లాపూర్,జూలై16: అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతామని చెప్పిన బీజేపీ ఇప్పుటికీ మాటను నిలుపుకోకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తునందని ఎమ్మార్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బీజేపీ జాతీయస్థాయి కార్యవర్గ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేతల అరెస్టు చేసి, దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శనివారం కుత్బుల్లాపూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మతోన్మాద పార్టీ మరోసారి దళితులను మోసం చేయడానికి పూనుకుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులకే వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టభద్రత తీసుకొస్తామని చెప్పి, ఇప్పుడు ఎనిమిదేండ్లు పూర్తయినా ఇప్పటికీ ఎలాంటి ఆలోచన చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మరోసారి ఢిల్లీ గద్దె లు కూల్చేందుకు రణరంగం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు కేశపాక రాంచందర్, బ్చలికూర స్వామి, శ్రీనివాస్, యాదగిరి, రమేశ్, దుర్గాప్రసాద్, లక్ష్మణ్, శంకర్,మదన్పాల్గొన్నారు.