కీసర, జూలై 16 : సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన భారతమ్మకు సీఎం సహాయనిధి నుంచి రూ.60వేలు, కీసర గ్రామానికి చెందిన హేమలతకు రూ.60వేల చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను శనివారం మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నేతలపై ఉందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు జె. సుధాకర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, టీఆర్ఎస్ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, రాజిరెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
కొర్రెములకు చెందిన ఒకరికి..
ఘట్కేసర్ రూరల్, జూలై 16 : అనారోగ్య సమయంలో పేదలను ముఖ్యమంత్రి సహాయనిధి ఆదుకుంటున్నదని కొర్రెముల సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన కే మహేందర్ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా శనివారం రూ. 60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ అందజేశారు. ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ సభ్యులు ఆంజనేయులు, దుర్గారాజు గౌడ్, బాబు, నాయకులు యాదగిరి, రవికుమార్, సత్యనారాయణ, నాగేశ్ గౌడ్ పాల్గొన్నారు.