కవాడిగూడ, జూలై 15: స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న కెరీర్ గైడెన్స్ అవగాహన కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్న పాఠశాలలో ఎస్ఆర్డీ, రెయిన్బో హోమ్స్, నిర్మాణ్, అమన్ వేదిక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో టెన్త్‌క్లాస్ నుండి డిగ్రీ వరకు చదివిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియో గం చేసుకొని ఉన్నత విద్యారంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ విద్యామండలి ఈఓ చిరంజీవి, ఎస్ఆర్డీ శ్రీనివాస్ రెడ్డి, శివరాణి, పార్వతి, రెయిన్బో సిటీ డెస్క్ అహరోను జోష్, క్రాంతి కిరణ్, సమద్, ఆశ్రయ్ బాలతేజస్సు సంస్థ నవీన్ రాజ్, బాల్యమిత్ర నెట్వర్క్ కన్వీనర్ అంభిక, అశ్రిత స్వచ్ఛంద సంస్థ పర్వతాలు, అజన్య, అమన్ వేదిక స్వచ్ఛంద సంస్థ ఎల్లయ్య, నిర్మల, ఆలీయా పర్వీన్, సంజీవ్, సురేష్, నాగభూషణం, జయ, సదాలక్ష్మీ, అరుణ్ స్వచ్ఛంద సంస్థ అనిత, డేనియల్, ఆర్ఎఫ్ఐ సంస్థ సంధ్య, సాజిదా తదితరులు పాల్గొన్నారు.