కొమురవెల్లి, జూలై 25 : విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వ చ్చిందంటూ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట సబ్స్టేషన్ ఎదు ట శనివారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స రైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వ్యవసాయరంగానికి సక్రమంగా కరెంట్ ఇవ్వకపోవడంతో వరితోపాటు ఇతర పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందేదని, అప్పట్లో నీళ్లు ఎక్కువైన తర్వాత తామే మోటర్లు ఆపుకొనే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. ప్ర స్తుతం ప్రకటించిన సమయాలకు కూడా కరెంట్ సరఫరా సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అధికారులు వ్యవసాయరంగానికి నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని, లేకపోతే పంటలు దెబ్బతిని నష్ట్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.