ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులుం
రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ సాగుతున్న వేళ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజుల పంజా విసురుతున్నాయి. విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నాయి. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి వివిధ పేర్లతో వేలాది రూపాయల ఫీజులను అదనంగా వసూలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
- విద్యార్థుల నుంచి అదనపు వసూళ్లు
- రిసిప్ట్లు కూడా ఇవ్వని యాజమాన్యాలు
- విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ సాగుతున్న వేళ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజుల పంజా విసురుతున్నాయి. విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నాయి. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి వివిధ పేర్లతో వేలాది రూపాయల ఫీజులను అదనంగా వసూలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎక్స్ట్రా, స్పెషల్ ఫీజుల పేరిట వసూలు చేస్తూ రశీదులు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇక కొన్ని కాలేజీలు కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
కోట్లలో వ్యాపారం
ఇంతకాలం బీ క్యాటగిరి సీట్ల వ్యాపారం యాజమాన్యాల పంట పండించింది. ఇప్పుడు అడ్మిషన్ ఫీజుల పేరిట కొత్త దందాకు కాలేజీలు తెరలేపాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిబంధనల ప్రకారం విద్యార్థి నుంచి రూ. 5,500 మాత్రమే ఫీజుగా తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలేవి ఆయా కాలేజీలు పట్టించుకోవడం లేదు.
అడ్మిషన్ ఫీజులను ఆదాయ వనరుగా మలుచుకుంటున్నాయి. ఈ అడ్మిషన్ ఫీజుల పేరిట కోట్లు దండుకుంటున్నట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 60 సీట్లున్న ఒక బ్రాంచీలోనే రూ. 30లక్షల వరకు వసూలు చేశారని చెబుతున్నారు. అంటే కాలేజీలో కొత్తగా 500 మంది చేరితే రూ.2.2కోట్లు వసూలు అవుతున్నట్టు లెక్క. నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్కూల్స్ అండ్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు.
వసూళ్ల పర్వమిలా..
- మైసమ్మగూడలోని ఓ కాలేజీలో కన్వీన ర్ కోటాలో సీటు వచ్చిన ఓ విద్యార్థి రి పోర్ట్ చేసేందుకు వెళ్లగా రూ. 30వేలు కట్టమన్నారు. లైబ్రరీ ఫీజు రూ. 14 వేలు, ఎగ్జామ్ ఫీజు రూ. 10వేలు, యూ నిఫామ్కు రూ.6వేలు కట్టమనడంతో అవాక్కయ్యాడు.
- గండిపేట సమీపంలోని కాలేజీలో అడిషనల్ ఫీజు పేరిట రూ. 40వేలు, ఇతర ఫీజు పేరిట రూ. 8,500 వసూలు చేసినట్టు ఓ విద్యార్థి తండ్రి వెల్లడించారు.
- నాగోల్‌లోని ఓ కాలేజీ విద్యార్థుల నుంచి రూ. 28వేలు వసూలు చేశారట.
- శంషాబాద్ సమీపంలోని మరో కాలేజీలో రూ. 10వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. కేవలం నగదు మాత్రమే తేవాలని చెబుతున్నట్టు తెలుస్తున్నది.
- ఘట్కేసర్లోని ఓ కాలేజీలో ఫీజులు చూస్తే కండ్లు తిరిగి బైర్లు కమ్మాల్సిందే. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 49,900 వ సూలు చేస్తున్నారు. అడ్మిషన్, ఎన్బీఏ, స్పెషల్ ఫీజు పేరిట రూ. 13,400, కెరీర్ డెవలప్మెంట్ పేరిట రూ. 18వేలు, యూనిఫామ్‌కు రూ.14వేలు, బుక్ లెం డింగ్ స్కీం రూ. 4,500ల చొప్పున కట్టించుకుంటున్నారు. ఈ ఫీజలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

