మహేశ్వరం, జూలై 14:టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం పోరండ్ల గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రతి గుండెలో నిలిచిపోయిందని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయడం లేదని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పాలన కొనసాగుతుందని అన్నారు. పార్టీకోసం పనిచేసే వారికి సముచిత స్థానం కలిపిస్తామని ఆమె అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజునాయక్, మాజీ అధ్యక్షుడు చంద్రయ్య, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు థామస్‌రెడ్డి, పోరండ్ల గ్రామశాఖ అధ్యక్షుడు యాదయ్య, యూ త్ అధ్యక్షుడు శంకర్, ఉపసర్పంచ్ మల్లేశ్, కాంగ్రెస్ పార్టీ నుంచి రవి, మహిపాల్, చం దు, సరేందర్, ప్రవీణ్, సురేశ్, సుధాకర్, రాము, శివకుమార్, అశోక్, ఆనంద్, శివ, నరేశ్, శ్రీకాంత్ అలాగే బీజేపీ పార్టీ నుంచి శ్రీనివాస్, శివకుమార్, వెంకటేశ్, చింటు, నిఖిల్, రాఘవేందర్, మహేశ్, రాఘవేందర్, సురేశ్, చిరంజీవి, దేవేందర్, నరేశ్, హైమత్, శ్రావణ్, శ్రీకాంత్ తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆసరా..
సీఎం రిలీఫ్ ఫండ్ నిరు పేదలకు ఆసరాగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం సిరిగిరిపురం గ్రామానికి చెందిన చిట్టి వెంకటేశ్, శ్రీలతలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. చిట్టి వెంకటేశ్‌కు, రూ. 29 వేలు, శ్రీలతకు రూ. 19 వేలు మంజూరు అయ్యాయి. ఆ చెక్కులను నగరంలోని మంత్రి నివాసంలో గురువారం వారికి అందజేశారు యూత్ అధ్యక్షుడు శ్రీను సిరిగిరిపురం గ్రామ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.