అబిడ్స్, జూలై 12: రాష్ట్రంలోని మైనార్టీ నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం సంతోషకరమని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎంకె బద్రుద్దీన్, ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు ఎండి అత్తర్ల్లాలు పేర్కొన్నారు. మైనార్టీలకు రుణాలు అందించేందుకు రూ.50 కోట్ల నిధులను విడుదల చేయడంతో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్‌కు వారు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్లకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.