సుల్తాన్ బజార్, జూలై 12: ఉద్యోగుల సమస్యలతో పాటు పెన్షనర్లు, సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గాను టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ చేస్తున్న సేవలు ఎనలేనివని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అఫ్జల్‌గంజ్‌లోని కేంద్ర రాష్ట్ర గ్రంథాలయంలో ముజీబ్ హుస్సేనీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవరణలో ఆయన ముజీబ్ హుస్సేనీతో కలిసి మొక్కలు నాటారు. గ్రంథాలయ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవేందర్ మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పరిష్క రించేలా ముజీబ్ హుస్సేనీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ మాట్లాడుతూ త్వరలోనే గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర గ్రంథాలయ టీఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు కేసరి హనుమాన్, పీజీవీ రాణి, గ్రంథాలయ యూనిట్ కార్యదర్శి బొల్లం మహేందర్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు వైదిక్ శస్త్ర, ఖాలెబ్ అహ్మద్, బి.శంకర్, శాగంటి అయోధ్య, నాల్గవ తరగతి అసోసియేషన్ సహ అధ్యక్షులు ఎంఏ ముజీబ్‌తో పాటు గ్రంథాలయ ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.