బండ్లగూడ,జూలై 11: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ మహేందర్‌గౌడ్ సూచించారు. సోమవారం ఆయన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ ఆలయం వద్ద నీటి ప్రవాహం పెరుగడంతో ఆట స్థలం నీటితో నిండిపోయిం ది. ప్రజల ఫిర్యాదుతో మేయర్, డీఈ యాదయ్య, సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకుని వర్షనీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో ఉండరాదన్నారు.హిమాయత్‌సాగర్ గేట్లు తెరుచుకోవడంతో ఈసీ వాగు వెంట ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన సూచించారు.
బండ్లగూడలో రోడ్లుకు మరమ్మతులు
ఇటీవల కురుస్తున్న వర్షాలతో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందుల గురవుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ కుంగిపొవడంతో ప్రమాదకరంగా మారాయి.నాయకులతో పాటు స్థానికులు కమిషనర్ వేణుగొపాల్రెడ్డికి ఫోన్ ద్వారా తమ సమస్యలను వివరించారు.దీంతో ఆయన సోమవారం దర్గాఖాలీజ్ఖాన్ నుంచి కిస్మత్పూర్ వెళ్లే దారి,రాక్చర్చి, పిరం చెరువు,కాళికనగర్ తదితర ప్రాంతాల్లో గుంతలు పడ్డ రోడ్లపై కంకర,మట్టితో చదును చేయించారు.అనంతరం డ్రైనేజీలకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.