సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్ -1కి సంబంధించి మిరాలం ఆలియాబాద్ ఆఫ్ టేక్ వద్ద 1200ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్‌కు జంక్షన్ పనులు జరపాల్సి ఉంది. ఎస్ఆర్డీపీలో భాగంగా జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఆటంకం కలుగకుండా ఈ పనులు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 13న ఉదయం 6 నుంచి 14వ తేదీ సాయంత్రం 6గంటల వరకు 36గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ పనుల కారణంగా ఫేజ్-1కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
మిరాలం, కిషన్‌బాగ్, అల్ జుబైల్కాలనీ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, మాదన్నపేట, మహబూబ్ మాన్షన్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, రియాసత్‌నగర్, ఆలియాబాద్, బాలాపూర్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, బొగ్గులకుంట, అప్జల్‌గంజ్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం, నల్లకుంట, చిలకలగూడ, దిల్సుఖ్నగర్, బొంగుళూరు, మన్నెగూడ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని అధికారులకు సహకరించాలని కోరారు.
13న మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం
కృష్ణా ఫేజ్ -2, 3కి సంబంధించి గొడకొండ్ల 132కేవీ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ను టీఎస్ ట్రాన్స్‌కో మార్చనున్నది. ఈ నెల 13న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు 3గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ 3గంటల పాటు ఫేజ్ 2, 3 పరిధిలో రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
మైసారం, బారాస్ శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, చింతల్ బస్తీ, షేక్‌పేట్, అలబండ, మేకలమండి, భోలక్ పూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా, తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, రైల్వేస్ కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్, సాహేబ్‌నగర్, వైశాలినగర్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్, మహేంద్రహిల్స్, సైనిక్‌పురి, మౌలాలి, వెలుగుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ, స్నేహపురి, కైలాస్గిరి, దేవేంద్రనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరిహిల్స్, మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమానగర్, గోల్డెన్ హైట్స్, నైన్ నంబర్, గంధంగూడ, బోడుప్పల్, మల్లికార్జుననగర్, మాణిక్‌చంద్, చెంగిచర్ల, భరత్‌నగర్, ఫీర్జాదిగూడ, మీర్‌పేట, లెనిన్‌నగర్, బడంగ్‌పేట, ధర్మసాయి, మన్నెగూడ, తురయంజాల్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.