ఎల్బీనగర్, జూలై 10: ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షాలు జోరుగా కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను
అప్రమత్తం చేశారు. ఎల్బీనగర్, హయత్‌నగర్, సరూర్‌నగర్ సర్కిళ్ల పరిధిలో ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసి ఎక్కడైతే వర్షం నీరు నిలుస్తుందో అక్కడికి వెంటనే చేరుకుని నీటిని తొలగింపజేసే పనులను జోరుగా చేపడుతున్నారు. జాతీయ రహదారిపై వరదనీటి కాలువ పనులు చేపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా మెట్రో డివైడర్‌ను మరికొన్ని ప్రాంతాల్లో తొలగించి అవతలివైపు నుంచి కూడా వాహనాలను పంపించేందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు సిద్ధం చేశారు. చాలా ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచినట్లు
సమాచారం వచ్చిన వెంటనే అధికారులు స్పందిస్తున్నారు.సరూర్‌నగర్ చెరువు ప్రాంతంలో చేరిన వరదనీటి ద్వారా నురుగు ఏర్పడి దిగువ కాలనీల్లోని ప్రవహించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు సర్కిళ్లలో జోనల్ కమిషనర్ పంకజతో పాటు ఉప కమిషనర్లు మారుతీ దివాకర్, సురేందర్‌రెడ్డి, హరి కృష్ణయ్య తమ పరిధిలోని ప్రాంతాలకు ఎమర్జెన్సీ టీంలను పంపించి సమస్యలకు పరిష్కారం చేయించారు.
సహారాకాలనీలో కూలిన చెట్టు మహిళకు తీవ్రగాయాలు
మన్సూరాబాద్, జూలై 10: పని నిమిత్తం బయటకు వచ్చిన ఓమహిళపై చెట్టు కూలడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.మన్సూరాబాద్ డివిజన్ సహారాస్టేట్స్కాలనీలోని ఓఅపార్టెమెంట్లో మంజుల తన కుటుంబసభ్యులతో కలిసిఉంటుంది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పనినిమిత్తం గాంధార్ అపార్ట్మెంట్స్ 18వ బ్లాక్‌కు వచ్చింది. పనిముగించుకుని అపార్ట్మెంట్ నుంచి కిందకు వచ్చింది.
కుమారుడు బైక్‌ను స్టార్ట్ చేస్తుండగానే పక్కనే ఉన్న చెట్టు కూలిఆమెపై పడింది. ఈ ఘటనలో మంజులకు తీవ్రగాయాలయ్యాయి. అపరస్మారక స్థితికి చేరుకున్న ఆమెకుస్థానికులతో పాటు ఈసీ మెంబర్ బెల్లంకొండ నాగభూషణంఆధ్వర్యంలో ప్రథమ చికిత్సను అందించారు. స్థానికుల ఫిర్యాదుమేరకు అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్‌లో చికిత్సనిమిత్తం వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు దవాఖానకు ఆమెను
తరలించారు. సహారా గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని చెట్లుప్రమాదకరంగా ఉన్నాయని.. అవి ఏ క్షణమైనా నేలకొరిగేఅవకాశం ఉందని స్థానికులు తెలిపారు. రెండు, మూడు రోజులవ్యవధిలోనే కాలనీలో నాలుగు చెట్లు కూలిపోయాయనితెలిపారు. అటవీశాఖ అధికారుల అనుమతులు తీసుకునిప్రమాదంగా ఉన్న చెట్లను వెంటనే తొలగించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చిరు జల్లులు.. హరి విల్లులు
మహావీర్ హరిణ వనస్థలి పార్కు వద్ద వర్షపు చిరు జల్లులు కురస్తున్న వేళ పర్యాటకులకు
ఆహ్లాదాన్ని పంచుతోంది. ఆదివారం వనస్థలిని వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు పార్కు ముంగిట ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు